టార్గెట్ చేసి రెక్కి నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన షాద్ నగర్ పోలీసులు..
నిందితుల్లో A1 గంగాధర్ సార్ డిసైడ్ చేస్తే టీమ్ ఆచరిస్తుంది..
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆరుగురు సభ్యులు ఒక బృందంగా ఏర్పడి హైవే లపై ఉన్న షాపులనే టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారం స్కెచ్ వేసి దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో ఈ నెల 19వ తేదీన షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో జరిగిన దొంగతనం పోలీసులకు పెను సవాలుగా మారింది.పట్టణ ముఖ్య కూడలిలో శెట్టర్లు ధ్వంసం చేసి నాలుగు లక్షలతో హుడహించడం పై సీరియస్ గా ఉన్న పోలీసులు నిందితుల అన్వేషణ వేగవంతం చేశారు. అరుగురి నిందితుల్లో A1 గంగాధర్ A2 అనిల్ లను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేయాగ మిగత నలుగురిలో ఇద్దరు కర్ణాటక వాసులని హన్మంత్ రాజ్ పృథ్వి రాజ్ లను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న ఏసీపీ రంగస్వామి,మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నట్టు తెలిపారు.నగరంలో జరిగిన చోరి పట్టణ ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లే విధంగా చర్చనీయాంశంగా మారిందని ,జిల్లాలోని మోహినాబాద్ షాబాద్ ప్రాంతాలో సైతం ఇదే తరహాలో దొంగతననికి పాల్పడిన ముఠా పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో మ్యాటర్ ను సీరియస్ గా తీసుకున్న షాద్ నగర్ పోలీసులు మూడు రోజుల పాటు ఎనలేని కృషి చేసి టెక్నీకల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి 10,000 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.మిగత సొమ్ము రికవరీ చేసి నష్ట పోయిన షాప్ యజమానులకు అందిస్తామని ప్రజలు పోలీసులపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోవద్దని అంకితభావంతో తమ విధులను నిర్వర్తిస్తామని ఏసీపీ రంగస్వామి తెలిపారు..ఈ కేసును చాక చక్యంగా చేదించిన పోలీసు బృందానికి తగిన రివార్డులతో సత్కరించారు..