అనుమానస్పదంగా ముగ్గురు రోజంతా తిరిగి ఇద్దరు చనిపోవడం ఎంతవరకు సమంజసం తల్లిదండ్రుల ఆవేదన
మాకు న్యాయం చేయండి తల్లుల విజ్ఞప్తి
మాకు అనుమానం ఉన్నది
బాధిత కుటుంబాలకు ఆవుల రాజిరెడ్డి ఆర్థిక సహాయం
డైలీ భారత్, మెదక్ జిల్లా మాసాయిపేట : మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే...
మాసాయిపేట గ్రామానికి చెందిన డప్పు నవీన్, 22 సం, తండ్రి బాల పోచయ్య. నెల్లూరీ రాము 26 సం, తండ్రి భాగయ్య. వారితోపాటు మరో యువకుడు శేషుని రాజు ముగ్గురు యువకులు కలిసి మంగళవారం గ్రామ శివారులోని ఒక క్వారీ నీటి గుంతలో స్నానానికి వెళ్లారు. అనంతరం ఇద్దరు యువకులు నీటిలో దిగగా గల్లంతు కాగా అతనితో పాటు ఉన్న మరో యువకుడు శేషుని రాజు 24 సం, వీరిద్దరూ మునిగిపోవడంతో గట్టుపైనే ఉన్న రాజు వాళ్ళ కుటుంబ సభ్యులకు బుధవారం నాడు విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వెంటనే చేగుంట పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీస్ అధికారులకు జరిగిన సంఘటనని వివరించారు అదేవిధంగా చేగుంట పోలీస్ స్టేషన్ స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి సిబ్బంది పోలీసులు తో ఘటన స్థలానికి చేరుకున్నారు అనంతరం కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా స్థానికుల సహకారంతో డప్పు రాజు మృతదేహాన్ని మొదటగా గ్రామపంచాయతీ ఆటోలో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అని పోలీసులు తెలిపారు అనంతరం నెల్లూరు రాజు మృతదేహం దొరకకపోవడంతో గజ ఈతగాలని రప్పించి గజ ఈత వాళ్ల సహాయంతో గాలింపులు చేపట్టగా
యువకుడు మృతదేహం లభించింది అనంతరం
మృతదేహాన్ని వెతికి తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి
విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్, దగ్గర ఉండి పోలీసులకు సహకరించారు అని అన్నారు అనంతరం నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి మాసాయిపేట గ్రామ నివాసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రాజిరెడ్డి జరిగిన సంఘటన వివరాలు తెలుసుకొని వీరి ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో
విషయం తెలుసుకున్న మాసాయిపేట మండలం కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్
ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి తెలుపగా తక్షణమే స్పందించిన రాజిరెడ్డి ఒక్కో కుటుంబానికి 5000
చొప్పున రెండు కుటుంబాలకు 10,000 ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మాసాయిపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు గుండారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్ బాధితుల తల్లిదండ్రులకు ఒక్క కుటుంబానికి 5000 చొప్పున పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది అనంతరం రాజు, నవీన్, తల్లిదండ్రులు బంధువులు మాకు అనుమానం ఉన్నది ఎలా చనిపోయారు అనేది మాకు పోలీసులు మాకు న్యాయం చేయాలని మీడియా సమావేశంలో మాట్లాడారు