| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

డైలీ భారత్, కడప: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఈ ఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది.

అయితే, రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. లింగంపల్లి పంపు హౌస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా గాజుల గంగయ్య విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రియుడుతో కలిసి ఇంట్లో భార్య సంధ్య ఉండడంతో అది చూసిన గంగయ్య ఆమెను మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న భార్య సంధ్య.. తమకు అడ్డుకుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు చంపేయాలని అనుకుంది..

ఇక, ఆ తర్వాత ప్రియుడు బాలరాజు సహకారంతో భర్త గంగయ్యను భార్య సంధ్య హతమార్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆగస్టు 22వ తేదీ నుంచి గాజుల గంగయ్య కనపడలేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడు, ప్రియురాలును అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను విచారణ చేయగా.. దర్యాప్తులో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు అని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Previous తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి : వాటిని కూల్చేయాలి...కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు
Next గత బీఆర్ఎస్ పాలకుల వల్లే చెరువుల ఆక్రమణలు: కేఎల్ఆర్
ADVERTISEMENT