హైడ్రాతో భవిష్యత్ తరాలకు మేలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమస్యల సుడిగుండంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని గత పాలకులు ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. ఇవాళ తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజల ఇబ్బందులను, సమస్యలను తెలుసుకున్నారు. భారీగా వచ్చిన ఆర్జీలను పరిశీలిస్తే మొత్తం భూకబ్జాలు, ఆక్రమణలు, చెరువులు కుంటలు మాయమైన విషయం తెలుస్తుందని కేఎల్ఆర్ అన్నారు. వరద ముంపు కాలనీలను ముంచేత్తిన గత బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదన్నారు. హైడ్రాతో త్వరలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లను సరిచేసి చెరువులను పునరుద్ధరిస్తాం - అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.