రేషన్ డీలర్ జగ్గుపై దాడి ఫిర్యాదు తీసుకోలేదని అధికారులపై మండిపడ్డాడు
నాకు అధికారులు న్యాయం చేయకపోతే నేను చనిపోతాను బాధితుడు మీడియాతో జగ్గు
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పరిధిలోని నడిపి తండా గ్రామపంచాయతీలో రేషన్ డీలర్ జగ్గు కుమారుడు గత 15 రోజుల క్రితం మరణించడం తెలిసిన విషయమే ఈ కుమారుని బాధలో నుండి తీరుకొక ముందే అతని బంధువులు అన్న తమ్ముని కుమారుడు చనిపోయాడని విషయం మర్చిపోయి సొంత అన్న నాపై దాడి చేశాడని తెలిపారు అనంతరం నాపై దాడి చేస్తుండగా ఇరుగుపొరుగువారు ఎవ్వరు పట్టించుకోవడంలేదని చూసుకుంటూ నవ్వుతూ ఏదైనా చేస్తూ వెళ్లిపోవడం జరిగిందని ఆవేదన వ్యక్తపరిచారు వెంటనే నాపై దాడి జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అధికారులు హేలనగా మాట్లాడుతూ నా కంప్లైంట్ తీసుకోవడం లేదని మీడియాకు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి విచారణ చేపట్టి ఫిర్యాదును తీసుకోవాలని మీడియా ద్వారా అధికారులకు విజ్ఞప్తి చేశారు