| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కెఎల్ఆర్ ట్రస్టు ద్వారా నెలకు రూ 7,800 జీతం

కెఎల్ఆర్ ట్రస్టు ద్వారా నెలకు రూ 7,800 జీతం

దాతృత్వం చాటిన కిచ్చెన్న

గూడు చెదిరిన ఇల్లాలికి అపన్నహస్తం

హర్షం వ్యక్తం చేసిన రావిర్యాల కాంగ్రెస్ నేతలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా; దాతృత్వంలో దశాబ్దాలుగా చేయూత అందిస్తూ... కేఎల్ఆర్ ట్రస్టు ద్వారా పిల్లలకు విద్యా వికాసం, నిరుద్యోగులకు ఉపాధి, పేదలకు అపన్నహస్తం అందించే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (KLR) మరోసారి మానవత్వం చాటుకున్నారు. 

మూడు నెలల క్రితం విద్యుత్ ఘాతంతో ఇల్లు పూర్తిగా దహనమైన తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల గ్రామానికి చెందిన దార ఆగమయ్య, గిరిజ దంపతులకు ప్రభుత్వ సహాయం రూ. 95 వేలు ఇప్పించారు. 

అంతేకాకుండా తన కేఎల్ఆర్ ట్రస్టు ద్వారా ఇద్దరు పిల్లలకు చదువు, కుటుంబానికి ఏళ్లవేళ్లలా అండగా ఉంటామని... ఉండాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. 

దీంతో రావిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బోధ పాండురంగారెడ్డి, మునగంటి రాజు, కోటగళ్ల రాజ్ కుమార్, మునగంటి రాజు, బాలరాజు సహా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 

అంతకు ముందు మల్లాపూర్ కు చెందిన వై.సత్యమ్మకు అంగన్వాడీ నుంచి అపాయింట్మెంట్ +జీతం వచ్చే వరకు కెఎల్ఆర్ ట్రస్టు ద్వారా నెలకు రూ 7,800 ఇవ్వాలని తన పర్సనల్ సెక్రటరీ ను ఆదేశించారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.

Previous నాకు భూమి మీద బ్రతకాలని ఆశ లేదు మానసిక వేదనతో జగ్గు
Next అందుబాటులోకి.. రైతు భరోసా యాప్
ADVERTISEMENT