| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం... షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం... షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా,: తెలంగాణలో ఇప్పుడు హైడ్రా పేరు మారుమోగుతోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. ఈ నేపద్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా షాద్ నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పడంతో ఈ అంశంపై సంచలనం రేకెత్తిస్తుంది. అంతేకాదు నియోజకవర్గంలో ఉదాహరణకు కొన్ని నీటి వనరులను ధ్వంసం చేసి అక్రమాలకు పాల్పడ్డ వ్యవహారాలను కూడా ఉదాహరించడంతో ఇక షాద్ నగర్ నియోజకవర్గంలో హైడ్రా రాక కోసం మార్గం సుగమం చేస్తున్నట్టు తెలుస్తుంది. 

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏమన్నారంటే..

హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా విధానాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తుతున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తుండడం విశేషం అన్నారు. ఏ ప్రభుత్వం ఏ పాలకులు చేయని ధైర్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించారని అభినందించారు. హైడ్రా తీసుకోవచ్చి అక్రమ కట్టడాలను కూల్చుతూ చెరువులు కుంటలను ఫీడర్ ఛానల్స్ ను కాపాడుతున్న తీరును శంకర్ ప్రశంసించారు. 

హైడ్రా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థని, హైడ్రాకు సంబంధించి అధికారి రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే నీటి వనరులను, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని గుర్తు చేశారు. 

షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా నీటి వనరులను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ నుండి నియోజకవర్గంలోని రెడ్డిపాలెం వరకు వచ్చే ఫిరంగి కాలువ కూడా మొత్తం ధ్వంసం చేసి అక్రమ కట్టడాలు కట్టారని నీటి వనరులకు సమస్య సృష్టించారని ఎమ్మెల్యే శంకర్ సంచలన విషయాలు చెప్పారు. ఫిరంగి కాలువపై గతంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఎన్నో ఫిర్యాదులు కూడా చేశారని.. ఈ సందర్భంగా గుర్తు చేయడం గమనార్హం. అదేవిధంగా ఫరూక్ నగర్ లోని బొబ్బిలిచెరువు భూమిలో కూడా అక్రమ కట్టడాలు జరిగాయని వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. మిగులు జలాలు అక్కమ చెరువు, అంచు కుంట చెరువు 

గత పాలకుల, రియాల్టర్ల లాభాపేక్షకు కబ్జాలకు గురయ్యాయని దీంతో నీటి వనరులకు ఎంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇంకా నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు కోకోలలుగా ఉన్నాయని పేర్కొన్నారు. 

ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు కబ్జా చేసిన దాఖలాలు ఉన్నాయని, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కట్టారని వాటిని తీసిపారేసే విధంగా హైడ్రా ఇక్కడ అమలు చేసీ హైడ్రాను

విస్తరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. తన నియోజకవర్గంలో హైడ్రాను యదేచ్ఛగా అమలు చేస్తానని ఎమ్మెల్యే శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వెంట పిసిసి సభ్యులు మహమ్మద్ అలీఖాన్ బాబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వరప్ప, చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, చెంది తిరుపతి రెడ్డి, గూడ వీరేశం, హరినాథ్ రెడ్డి, సయ్యద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు

Previous ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్
Next సీఎం రేవంత్‌ జైలుకు వెళ్లే ప్రమాదం... సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్
ADVERTISEMENT