| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్

ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్

తాగి వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమయ్యాడు

కఠిన చర్యలతో పాటు కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తాం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: డ్రైవర్ నిర్లక్షం కారణంగా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని  చేగూరు ముఖ్య కూడలి లో జరిగిన లారీ ప్రమాదంలో షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్ కు చెందిన తల్లి కూతురు కావ్య (25), కూతురు అనన్య (1) మృతి చెందారు. సోమవారం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను స్థానిక నాయకులతో కలసి ఎమ్మేల్యే పరామర్శించారు. ఈ సంధర్బంగా ప్రమాదం జరిగిన తీరుపై ఆరాతీసి శంషాబాద్ ఏసీపి, కొత్తూరు సిఐతో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తప్పతాగి వాహనం నడిపిన, ఇలాంటి తగుబోతులను డ్రైవర్లుగా పెట్టుకున్న వ్యక్తులపై కూడా చ్చర్యలు తీసుకుని కుటుంబానికీ న్యాయం చేయాలని కోరారు. మృతి చెందిన కుటుంబానికి  తక్షణ సహాయంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 15 వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం అప్ప, మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Previous కూల్చివేతలపై హైడ్రా నివేదిక - లిస్టులో ప్రముఖులకు చెందిన నిర్మాణాలు - ఎవరెవరివి ఉన్నాయంటే?
Next ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తాం... షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT