డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణ శ్రీనగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జమాల్పూర్ చందు జన్మదినం సందర్భంగా స్థానిక ఎన్ హెచ్ 44 హోటల్ లో ఘనంగా వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా జమాల్పూర్ చందును షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, సీనియర్ నాయకులు పి రఘు, మైనార్టీ నేతలు బాబర్ ఖాన్, ఇబ్రహీం, శ్రీధర్ గౌడ్, నాగరాజు తదితరులు కలిసి శాలువాతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగి ప్రజాసేవ చేయాలని కోరారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించారు..
News
కాంగ్రెస్ నాయకుడు జమాల్పూర్ చందును సన్మానించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి