డైలీ భారత్, ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కవలలు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం నగర పరిధిలోని దానవాయిగూడెం కాలనీకి చెందిన కవలలు నవీన్(22), మహేశ్(22) డిగ్రీ పూర్తిచేసి పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పవన్ అనే స్నేహితునితో కలిసి మంగళవారం బైక్‌పై వెళుతుండగా ట్రాలీ ఆటో వీరి బైక్‌ను ఢీకొనటంతో నవీన్, మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన పవన్ చికిత్స పొందుతున్నాడు.
News
మరణంలోనూ విడిపోని కవలలు.. రోడ్డు ప్రమాదంలో మృతి