కొలకత్తా మెడికో విద్యార్థిని పై అత్యాచారారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
సామూహిక అత్యాచారం చేసిన నిందితుల అవయవాలు తొలగించే విధంగా చట్టాలలో మార్పులు తీసుకురావాలి.
మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
అతి క్రూరంగా అత్యాచారం, హత్య చేసిన నిందితుల పక్షాన వాకాలత్ చేయకుండా బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా చర్యలు చేపట్టాలి.
ఐ.ఎం.ఏ చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెల్పిన కరీంనగర్ బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు.
కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి వెల్లడి.
డైలీ భారత్, కరీంనగర్: పశ్చిమ బెంగాల్ లో అర్.జి.కార్ ప్రభుత్వ దవాఖానలో పి.జీ చదువుతున్న ఒక విద్యార్థిని పై ఆగష్టు 9వ తేదీన ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు అదే ధవాఖానలో విధుల మాటున అతి క్రూరంగా జంతువుల వలే సామూహిక అత్యాచారం చేసి చంపేసిన మృగాల అవయవాలు అనగా అంగం, కాళ్ళు, చేతులు, నాలుక, కళ్లు తీసివేసే విధంగా చట్టాలలో మార్పులు తీసుకువస్తేనే ఇలాంటి అత్యాచారాలు భవిష్యత్ లో జరగకుండా ఉంటాయని కరీంనగర్ జిల్లా ఐ.ఎం.ఏ డాక్టర్స్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లోని ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో 36 గంటల డ్యూటీ చేస్తున్న మెడికల్ పి.జీ విద్యార్థిని పై అతి క్రూరంగా సామూహిక అత్యాచారం, హత్య సంఘటన జరుగుతే ఆ వైద్య కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన నిలువకుండా పాశవికంగా సామూహిక అత్యాచారం చేసిన నిందితుల పక్షాన ఉండి ఆ సామూహిక అత్యాచారం, హత్య చేసిన నిందితుల పక్షాన నిలిచి ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, సాక్ష్యాలుగా ఉన్న సి.సి కెమెరాలు ఉన్న రూమ్ లను ధ్వసం చేసి కూలగొట్టడం, శాంతియుత నిరసన తెలుపుతున్న డాక్టర్స్ పై వందల మంది తృణమూల్ గుండాలు దాడి చేయడాన్ని చూస్తుంటే అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల హస్తం ఈ హత్య వెనుక ఉందనే విషయం స్పష్టమవుతున్నదని బేతి మహేందర్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఈ అత్యాచారం, హత్య సంఘటనలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు ఉన్నారనడానికి నిదర్శనం అక్కడి ప్రభుత్వం ఈ సంఘటనను సాధారణ సంఘటనగా చూడడమే కాకుండా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కు వేరే చోటకు మార్చి అక్కడ ఇంకో పెద్ద భాద్యతలు కట్టబెట్టడమే ప్రధాన కారణమని బేతి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా కళ్లకు కట్టినట్లు కనపడుతుంటే అక్కడి ప్రభుత్వం, పోలీసులు చూస్తూ మౌనంగా ఉండడాన్ని సవాల్ చేస్తూ సామూహిక అత్యాచారం, హత్యకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు కోల్కత్త హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఉత్తర్వుల ద్వారా కేసును సి.బీ.ఐ కి అప్పాజెప్పడం అక్కడి మమతా బెనర్జీ సర్కార్ కు చెంప దెబ్బ లాంటిదని బేతి మహేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అదే విధంగా బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా సభ్యులు ఈ సామూహిక అత్యాచారం చేసిన నిందుతుల పక్షాన ఏ అడ్వకేట్లు కూడా వాకాలత్ చేయకుండా ఒక సర్కులర్ ను తీసుకువచ్చే విధంగా ఒక రేసల్యూషన్ పాస్ చేయాలని ఈ సందర్బంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఛైర్మెన్ ను కోరారు. ఈ ధర్నాకు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి. రఘువీర్, కార్యవర్గ సభ్యులు సుంకే దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.