రన్నరప్ చేగూరు జట్టు
నిర్వాహకులు బంటారం మల్లేష్ గౌడ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నందిగామ మండలం చేగూరు గ్రామంలో నిర్వాహకుడు బంటారం మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ టోర్నమెంటు విజేతగా షాద్ నగర్ జట్టు నిలిచింది. ఈనెల 8న చేగూరులో ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంటును షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంఛనంగా ప్రారంభించిన సంగతి విధితమే. సోమవారం గెలిచిన షాద్ నగర్ జట్టుకు నగదు బహుమతిని బంటారం మల్లేష్ గౌడ్ అందజేశారు. అదే విధంగా రన్నరప్ గా చేగూరు జట్టు నిలిచినట్టు ఆయన వెల్లడించారు. క్రీడల కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మల్లేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. తన సొంత ఖర్చులతో 4 లక్షల రూపాయలు వెచ్చించి యువత కోసం వాలీబాల్ గ్రౌండ్ ను కూడా నిర్మించినట్టు మల్లేష్ గౌడ్ తెలిపారు.
ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేసేందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంటులు నిర్వహించి క్రీడల కోసం వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తానని మల్లేష్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేసిన క్రీడాకారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..