| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మందుబాబులకు గుడ్ న్యూస్... రూ.80-90కే క్వార్టర్?

మందుబాబులకు గుడ్ న్యూస్... రూ.80-90కే క్వార్టర్?

డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్ డెస్క్: నూతన మద్యం విధానం రూపొందిస్తున్న ఏపీ ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది.  రాష్ట్రంలోని అన్ని రకాల ఎన్‌ఎంసీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్‌ రూ.200కు విక్రయించగా దాన్ని రూ.80 నుంచి 90 లోపే నిర్ధారించాలని యోచిస్తోంది. అయితే మద్యం నాణ్యత విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్‌ శాఖ కంపెనీలతో చర్చించింది. కొత్త పాలసీ ఈ నెల చివరలో లేదా వచ్చే నెల తొలి వారం నుంచి అమల్లోకి రానుంది. మద్యం ధరలు భారీగా పెరగడంతో యువత గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మద్యం పాలసీ కోసం ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు, అక్కడ అమలవుతున్న మద్యం విధానాలను అధ్యయనం చేశారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్‌ సబ్మిట్‌ చేయనున్నారు

Previous వాలీబాల్ టోర్నమెంట్ విజేత షాద్ నగర్ జట్టు
Next కష్టపడ్డది కేసీఆర్.. క్రెడిట్ కాంగ్రెస్ ది : మాజీ మంత్రి హరీష్‌ రావు
ADVERTISEMENT