చేగూరు జిల్లా పరిషత్ పాఠశాలలో వాలీబాల్ గ్రౌండ్ మరియు టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చేగురు గ్రామంలో చేగుర్ వాలిబాల్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 9వ ఉమ్మడి జిల్లా స్థాయి వాలిబాల్ టోర్నమెంట్ మరియు వాలిబాల్ గ్రౌండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎమ్మెల్సి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతు గ్రామాలలోని యూవకులు క్రీడా రంగంలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర, మరియు జాతీయ స్థాయిలో రానించి, తమ గ్రామాలకి మంచి గుర్తింపు తీసుకురావాలని క్రీడాకారులకి ఎల్లప్పుడు తనవంతు ప్రోత్సాహం ఉంటుందని, అంతేకాకుండా వాలి బాల్ గ్రౌండ్ నిర్మాణ దాత బంట్టారం మల్లేష్ గౌడ్ ని మరియు టోర్నమెంట్ నిర్వాహకులను ఎమ్మెల్సి నవీన్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో చేగురు మాజీ సర్పంచ్ సంతోష విట్టల్,చేగురు పిఎసిఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్, బండన్ గూడ మాజీ సర్పంచ్ కుమార్, బండ మల్లేష్, ఉప సర్పంచ్ సురేష్ గౌడ్,మరియు బిఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు,గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు..