| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేశంపేట పొలీస్ స్టేషన్ లో మజ్లీస్ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్

కేశంపేట పొలీస్ స్టేషన్ లో మజ్లీస్ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ నగరంలోని బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మేల్యే మహమ్మద్ ముబీన్ ను కేశంపేట పొలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవలే ఓ ప్రార్థనా మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆయన జీహెచ్ ఎం సి సిబ్బందిపై బూతు పురాణం తో రెచ్చి పోయిన సంగతి విదితమే. తాజాగా రోడ్డు విస్తరణ పనులను పురస్కరించుకుని ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా నగర పోలిసులు ఎమ్మేల్యే ముబీన్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ సంధర్బంగా రంగారెడ్ది జిల్లా లొని కేశంపేట మండల పొలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి ఎమ్మెల్యే ను కలుసుకోవడానికి పోలిసులు నిరాకరించారు. పై అధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి ఫోటోలు తీసుకోరాదు హైదరా బాద్ పోలిసులు మీడియాకు తెలిపినట్లు సమాచారం.

Previous వీరభద్ర స్వామి గుడికి 51000 రూపాయలు విరాళంగా ఇచ్చిన అత్తెల్లి అనంతరెడ్డి
Next యువత క్రీడారంగంలో గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలి : ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT