ఎస్సీ నిధులను వెంటనే విడుదల చేయాలి
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు
డైలీ భారత్, మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో నీ మాసాయిపేట మండలం కార్యాలయంలో మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతి కి మాసాయిపేట ఎస్సీ మోర్చా ఆకారం బాబు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్ల సభలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ మాదిగ కి రావలసిన నిధులను విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ , ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆకారం బాబు అన్నారు అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్కు అనుగుణంగా నిధులు కేటాయించేయాలని డిమాండ్ చేశారు . కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్డ్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునః నిర్మాణం తదితర అంశాలకు రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరశిస్తున్నాం. అని ఆవేదన వ్యక్తపరిచారు ఇప్పటికైనా ఈ క్రింది డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని బిజెపి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆకారం బాబు విన్నపం తెలియజేశారు అనంతరం
1) అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేయాలి. అని కోరారు అదేవిధంగా 2) ఎస్సీ ఉప కులాలు, మాల , మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి రూ. 750 కోట్లు కేటాయించాలి. అని అన్నారు అనంతరం 3) ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్లు నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయం అందజేయాలి అని అన్నారు. 4) ఎస్సీ హాస్టల్స్ పునః నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని కోరారు
5) ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించాలని కోరారు అనంతరం మాసాయిపేట పట్టణ అధ్యక్షుడు నవీన్ యాదవ్, ఉమ్మడి మండలం చేగుంట మాసాయిపేట, మండల అధ్యక్షుడు కిసాన్ మోర్చా నాగేందర్ రెడ్డి, మాసాయిపేట మండలం అధ్యక్షుడు పాపన్న గారి వేణుగోపాల్, టి.ఎంఆర్పిఎస్, గుడ్డి కృష్ణ మాదిగ మాసాయిపేట గ్రామ బూత్ అధ్యక్షుడు గౌర గల రాములు తదితరులు పాల్గొన్నారు