Posted on 2023-11-03 08:56:42
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల బిజెపికి భారీ షాక్ ఎదురైంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లగిషెట్టి శ్రీనివాస్, మరికొందరి నేతలతో కలిసి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడుకి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితుదినై, బండి సంజయ్ తనకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించడంతో పాటు సిరిసిల్ల టికెట్టు ఇస్తానని హామీ ఇవ్వడం వల్ల బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరినట్లు తెలిపారు. బిజెపి బిసిలకు పెద్దపీట వేస్తుందని నమ్మి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తీరా ఎన్నికల సమయంలో స్థానికులకు టికెట్టు ఇవ్వకుండా ప్యారశుట్ లీడర్ రాణి రుద్రమకు సిరిసిల్ల టికెట్టు అధిష్టానం ప్రకటించారని మండిపడ్డారు. 90 శాతం ఉన్న పద్మశాలి వర్గాన్ని విస్మరించి, స్థానికేతరులకు టికెట్టు కేటాయించడాన్ని విమర్శించారు. అందువల్లే బిజెపి పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా సిరిసిల్ల బరిలో ఉంటున్నట్లు తెలిపారు. ఒక బిసి బిడ్డగా తనను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బిసి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల మద్దతు తనకు ఉందని, సమస్యలపై అవగాహన ఉన్న స్తానికుడైన తనను గెలిపించాలని కోరారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఆమోదించాలని కోరారు.
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >
ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-08-15 07:33:17
Readmore >
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >