| Daily భారత్
Logo




డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సామ రవీందర్ రెడ్డి బదిలీ...

News

Posted on 2024-08-01 19:32:04

Share: Share


డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సామ రవీందర్ రెడ్డి బదిలీ...

రాజేంద్రనగర్ డిగ్రీ కళాశాలకు నియామకం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా అర్థ శాస్త్ర అధ్యాపకులుగా పనిచేసిన డాక్టర్ రవీందర్ రెడ్డి బదిలీ అయ్యారు. గురువారం జరిగిన ఈ బదిలీలో ఆయన ఇకనుండి రాజేంద్రనగర్ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహించనున్నారు.

షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలల్లో  డాక్టర్ రవీందర్ రెడ్డి ప్రజా ప్రతినిధులు, దాతల సహకారంతో కొత్త డిగ్రీ కళాశాలకు అదనపు రూములు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ల్యాబుల సౌకర్యాల కల్పనకు ఎంతో కృషి చేశారు. అంతే కాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు న్యాక్ బి ప్లస్ గ్రేడ్ రావడానికి ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను జాతీయస్థాయిలో స్పోర్ట్స్ లో, అడ్వెంచర్ క్యాంపులో అగ్రస్థానంలో నిలిపాడు.  ఎన్ఎస్ఎస్  ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలోని బదిలీ అయినటువంటి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి పాటుపడ్డ ప్రజాప్రతినిధులకు, దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సొంత ప్రాంతంలో  ఇన్ని సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు అత్యంత సంతృప్తిని ఇచ్చాయని తెలిపారు. ప్రస్తుతం  బదిలీపై వెళ్లిన కళాశాలలో కూడా  తన వంతు సహాయం చేసి కళాశాల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థి విద్యార్థులు బాధాకర హృదయంతో ఆయన సేవలు కొనియాడుతూ సత్కరించి అభినందించారు..

Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >
Image 1

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు

Posted On 2026-07-04 13:59:26

Readmore >