| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొండచరియలు విరిగిపడి 19 మంది దుర్మరణం

కొండచరియలు విరిగిపడి 19 మంది దుర్మరణం

కేరళలో కొండచరియలు విరిగిపడి 19 మంది దుర్మరణం

డైలీ భారత్, కేరళ : కేరళలోని వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించినట్టు తెలుస్తుంది, మృతుల సంఖ్య పెరుగొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వందలాది మంది శిథిలాల కింద చిక్కు కున్నట్లు అను మానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఘటనా స్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టి నట్లు అధికారులు తెలిపారు. 

ఇప్పటి వరకు ఐదుగురు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మెప్పాడి ముండకై ప్రాంతం లో అర్థరాత్రి 1గంటలకు ఆ తర్వాత తెల్లవారుజామున 4గంటలకు రెండుసార్లు కొండచరియలు విరిగ పడ్డాయి. 

సమాచారం అందుకున్న వెంటనే కేరళ రాష్ట్ర విపత్త నిర్వహణ దళం, ఫైరింజన్లు స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నాయి. 

సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు రెస్య్కూ టీమ్ సైతం వయనాడ్ కు చేరుకుంటున్నట్లు అధి కారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండ టంతో సహాయక చర్యలకు అంతరాయం వాటిల్లు తోంది.

Previous పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్‌
Next జనసేన పార్టీ సరికొత్త రికార్డు
ADVERTISEMENT