| Daily భారత్
Logo




మీ భర్త ఎవరో చెప్పండి.. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి నోటీసులు

News

Posted on 2024-07-22 12:02:09

Share: Share


మీ భర్త ఎవరో చెప్పండి.. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి నోటీసులు

శాంతిపై కొత్తగా తొమ్మిది అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సస్పెన్షన్‌లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆమె భర్త ఎవరనే విషయంలో స్పష్టత కోరుతూ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ నోటీసులు పంపారు. ‘‘దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు కె. మదన్‌మోహన్ అని సర్వీస్ రిజిస్టర్‌లో ఆమె నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్‌మోహన్ అని పేర్కొన్నారు. కానీ ఈ నెల 17న నిర్వహించిన విలేకరుల సమావేశంలో పి.సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి తొమ్మిది అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్‌గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు.

రికార్డుల్లో భర్త పేరు మదన్‌మెహన్‌గా పేర్కొన్నారంటూ శాంతికి నోటీసులు,

ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం

Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >