| Daily భారత్
Logo




ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు

News

Posted on 2024-07-08 17:55:15

Share: Share


 ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ  జయంతి వేడుకలు

డైలీ భారత్, నర్సాపూర్ మెదక్ ప్రతినిధి:మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని, నర్సాపూర్ పట్టణంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి  75వ జయంతి సంద్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్.

ఈ సంధర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధత్యలు స్వీకరించి.. తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. సుధీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలనే సంక్షేమ పథకాలుగా రూపుదిద్ది ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు.. ప్రజలకు గుండె చప్పుడు అయ్యారు. పథకాల విషయానికి వస్తే ఆరోగ్య శ్రీ నుంచి 108 వరకు.. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నుంచి రుణమాఫీ వరకు ఇలా చెప్పుకుంటే పోతే చాలా పథకాలే ఉన్నాయి. ఆ మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి..ఆ అద్భుతమైన పథకాలను ఓసారి గుర్తు చేసుకుంటు ఆయన్ను కూడా స్మరించుకుందాం అన్నారు.


ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, లలిత నర్సింగ్, రుస్తుంపేట్ మాజీ ఎంపిటిసి అశోక్, నర్సాపూర్ మండలం అధ్యక్షులు మల్లేష్,శివ్వంపేట్ మండలం అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, నర్సాపూర్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, అభిక్ ఖాన్, నర్సాపూర్ మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు అజ్మత్,రత్నపూర్ మహేష్, తునికి రమేష్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >