| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

నియోజకవర్గం లోని పలు సమస్యల గురించి చర్చించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్ రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్  కార్యాలయంలో కలెక్టర్ శశాంక్ ని కలిసి పలు విషయాల పై చర్చించారు.కొత్తూరు మండల పరిది లోని సిద్ధాపూర్ ప్రభుత్వ భూములపై వెంటనే సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములను పేదలకు ఇళ్ళ స్థలాల కేటాయింపు కోసం ,ఆట స్థలానికి కేటాయించండి సిద్దపూర్ గ్రామంలో భూసేకరణ లో అవకతవకలకు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అలాగే భూములు కోల్పోయి పరిహారం పొందకుండా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీ కోరారు. అదేవిధంగా పలు సర్వే నెంబర్లలో పేదల ఇళ్ల నిర్మాణానికి ,అటస్థలాల కోసం కనీసం 15 నుంచి 20 ఎకరాల భూమిని సర్వే చేసి గుర్తించి ఇవ్వగలరని కోరారు కొందుర్గ్ మండల కేంద్రంలో  నిర్మించ తలపెట్టిన స్టేడియం కోసం భూసేకరణ చేసి త్వరగా అప్పగించేందుకు తగు చర్యలు తీసుకోగలరని షాద్ నగర్ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల పై వెంటనే సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలు కేటాయింపులు జరిగేటట్టు చూడగలరని గత ప్రభుత్వంలో డబుల్  బెడ్రూంల  కేటాయింపుల్లో ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, ఇష్టానురీతిగా తమ అనుచరులకి డబుల్ బెడ్ రూం లను   కేటాయించారు. కావున అర్హులైన పేదలకు మాత్రమే కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ,లబ్ధిదారుల ఎంపికలో పార్టీలకతీతంగా వ్యవహరించాలని పాలిటెక్నిక్ కళాశాల కు త్వరగా భూమిని కేటాయించాలని కోరారు.సమస్యలపై జిల్లా కలెక్టర్ తో పాటు వచ్చిన అదనపు కలెక్టర్ కలెక్టర్ (స్థానిక సంస్థలు ) , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి తదితరులతో సమావేశమై ఆ శాఖల్లో పెండింగ్ సమస్యల గురించి చర్చించారు.

Previous జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ అప్పలనాయుడు
Next ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి రాజనర్సింహ
ADVERTISEMENT