డైలీ భారత్, కర్ణాటక: కర్ణాటకలోని హవేరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు నేషనల్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా 13 మంది చనిపోయారు. బైడ్గి తాలూకాలోని గుండెనహళ్లి క్రాస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని ఎమ్మిహట్టి గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది.
News
ఘోర ప్రమాదం.. 13 మంది మృతి