డైలీ భారత్, కాసిపేట : కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్, కళాశాలలో గంజాయి , మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీసులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. గ్రామంలో చుట్టుపక్కల గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా వినియోగం నాటి చర్యలకు పాల్పడినట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
News
మత్తు పదార్థాలకు అలవాటు పడద్దు : ఎస్సై ప్రవీణ్