| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణి

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణి

డైలీ భారత్, చంద్రంపేట: జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చంద్రంపేట ఉన్నత పాఠశాలలో  చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు  వైద్యాధికారిని శ్రావణి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరముల పిల్లలు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు.నులి పురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత , పౌష్టికాహార లోపం , బలహీనత , కడుపునొప్పి లక్షణాలు ఉంటాయని అన్నారు. అందుకే ప్రతి ఒక్క చిన్నారి అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం అనిత, ఆశ భూలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.

Previous పటాన్ చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు
Next రీల్స్ మోజులో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయిన యువకుడు
ADVERTISEMENT