| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పటాన్ చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

పటాన్ చెరు ఎమ్మెల్యే నివాసంలో ఈడీ సోదాలు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోగురువారం ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే MLA గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలోఈరోజు ఈడీ తనిఖీలు చేపట్టింది. 

మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు,బంధుల ఇళ్లలోనూ, సోదాలు కొనసాగుతు న్నాయి.. మొత్తంగా ఏక కాలంలో మూడు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 

అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. 

ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది....


#hyderabad  #ED #telangana #brs mla

Previous నీట్ పేపర్ లీక్ కేసులో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం
Next చంద్రంపేట ఉన్నత పాఠశాలలో పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణి
ADVERTISEMENT