డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న TGSRTC ఉద్యోగులను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
కరీంనగర్ కలెక్టరేట్ లో మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్యలను సన్మానించి.. వారికి రివార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , కరీంనగర్ కలెక్టర్ ప్రమీల సత్పతి ,అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ , ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ , రీజినల్ మేనేజర్ సుచరిత , తదితరులు పాల్గొన్నారు.