| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

జయ జయహే తెలంగాణ రాష్ట్ర  గీతాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 

పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2 ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ సర్కార్ వైభవంగా నిర్వహిస్తోంది.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఆవిర్భావ సంబురాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కవి అందెశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.

Previous పార్టీలకు అతీతంగా ఉద్యమకారులకు గుర్తింపు : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next నవీన్ రెడ్డిని సన్మానించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
ADVERTISEMENT