నవీన్ కుమార్ రెడ్డిని అభినందించిన కేటీఆర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, అంజయ్య యాదవ్..
అభినందించిన మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని, ప్రజలు మళ్లీ కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ రెడ్డి, లక్ష్మీ దంపతులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొన్నారు.
తన గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తనను మనస్పూర్తిగా ఆశీర్వదించినట్టు నవీన్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా
నవీన్ కుమార్ రెడ్డిని అభినందించిన కేటీఆర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి, అంజయ్య యాదవ్, అభినందించిన మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని అభినందించారు.
అదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం గెలుపు తర్వాత ఆయన "నేడు దినపత్రిక"తో మాట్లాడారు. కొందరు బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తం అంటున్నరని, 25 ఏళ్ల ప్రస్థానమున్న బీఆర్‌ఎస్‌ను ఖతం చేయడం ఎవరివల్లా కాదని వ్యాఖ్యానించారు.
‘తెలంగాణ వస్తుందని ఎవరూ కల కనలేదు. పదిహేనేళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తామని మాట్లాడుతున్నరు. ఇవన్నీ టెంపరరీ సెట్‌బ్యాక్స్ అని అన్నారు. మళ్లీ మేం అధికారంలోకి వస్తం. అందులో 100శాతం అనుమానం లేదు. 25 ఏళ్ల ప్రస్థానమున్న పార్టీని ఖతం చేయగలరా..? పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే అధికారం’ అని నవీన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కనీసం నీళ్ల కోసం మాట్లాడినవాళ్లు కూడా లేరన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరులో సభపెట్టి పోరాటం చేస్తే జూరాలకు నీళ్లు వచ్చాయని చెప్పారు. అప్పట్లో కుడి కాలువకు ఫ్రీగా నీళ్లిచ్చి, ఎడమ కాలువకు ఛార్జీలు వసూలు చేసేవాళ్లని తెలిపారు. ఉద్యమంలో ఎంతో గొప్ప ప్రస్థానం ఉన్న కెసిఆర్ ను ఎవరు ఏం చేయలేరని తన గెలుపును పాలమూరు ప్రజలకు అంకితమిస్తున్నానని నవీన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు నవీన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు..