| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్టీఆర్ కి ఘన నివాళులర్పించిన సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం తమ్ముళ్లు

ఎన్టీఆర్ కి ఘన నివాళులర్పించిన సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం తమ్ముళ్లు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరించి,కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆవునూరి దయాకర్ రావు మాట్లాడుతూ తెలుగుజాతిని ప్రపంచ నలుమూలల తెలియజేసిన గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు అని కూడు,నీడ,గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది అని తాను ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ప్రజలకు అందించడం జరిగిందని అలాగే పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం,స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం,రెవెన్యూ డివిజనాలను ఏర్పాటు చేయడం,చేనేత కార్మికులకు సబ్సిడీ కరెంటును అందించడం,పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన ఘనత నందమూరి తారక రామారావు కి చెందినది. ఆయన చేసిన పనులను స్మరిస్తూ ఈరోజు ఆయన 101వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రానున్న రోజుల్లో ఆయన చూపిన బాటలో నడుస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికై పాటుపడతామని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మచ్చ ఆంజనేయులు, టీ,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి, నక్క రాజయ్య,చేట్కూరి నారాయణ గౌడ్,కడారి రాంరెడ్డి,బింగి వెంకటేశం,లక్ష్మణ్, దత్తాద్రి, సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.

Previous బాస‌ర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌
Next హనుమాన్ శోబయాత్ర లో పాల్గొన్న ప్రభుత్వ విప్
ADVERTISEMENT