నవ్య సర్జరీ కోసం రెండు లక్షల 50 వేలు ఆర్థిక సహాయం
నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చేతులమీదుగా పంపిణీ
డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట మండలం హకీమ్ పేట్ గ్రామానికి చెందిన పత్తి నవ్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతుంది. సర్జరీ నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి 2,50,000 వేల రూపాయల Loc చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందజేసిన పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని మాసాయిపేట ఎంపీటీసీ కృష్ణారెడ్డి , మాసాయిపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, తెలిపారు అదేవిధంగా నరసాపూర్ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఆపదలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందుండి నిలబడి పేద ప్రజలకు బడుగు బలగిన వర్గాలకు ముందుండి సహాయం చేస్తుందని అన్నారు అదేవిధంగా ముందు ముందు దశలవారీగా కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న అంశాలను త్వరగా చర్చించి రైతులకు ప్రజలకు నిరుద్యోగులకు వృద్ధులకు న్యాయం చేసే విధంగా ప్రణాళికలు తయారవుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్ , ఎస్సీ సెల్ ముక్క దశరథ , పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నరసింహులు, అశోక్ రెడ్డి, జంగిటి భూస్వామి, గుండారం శ్రీనివాస్, రమేష్, ఉదండపురం తాజా మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, పెరుమళ్ళ రమేష్, బాలేష్ జగదీష్ గౌడ్ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు