డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఫకీర్ నాయక్ తాండా కు చెందిన రాథోడ్ శ్రీకాంత్ అనే వ్యక్తి తన మహేంద్ర మ్యాక్స్ వాహనంను తనిఖీ చేయగా, టేకు దుంగలను స్వాదినం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారి గీరయ్య తెలిపారు. కలప విలువ దాదాపు 50 వేల వరకు ఉంటుందన్నారు. ఈ దాడిలో ఈశ్వర్, విఠల్, నిరంజన్, జంగు, నితీష్, రమేష్ ఉన్నారు.
News
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం