బండి సంజయ్, రాణి రుద్రమదేవి పై విరుచుకుపడ్డ మేనేని రోహిత్ రావు
డైలీ భారత్, కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కరీంనగర్ లో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శామంత్రి పొన్నం ప్రభాకర్ పై పలు ఆరోపణలు చేయడం తో పాటు రాణి రుద్రమదేవి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రోహిత్ రావు గారితో పొన్నం ప్రభాకర్ కావాలని 10 కోట్ల వరకు ఖర్చు పెట్టించి చివరకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని చేసిన వ్యాఖ్యల తీవ్రంగా ఖండిస్తూ...టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనిణి రోహిత్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్ లోని స్థానిక మైత్రి హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ నేపథ్యంలో మొదట నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శులు వైద్యుల అంజన్ కుమార్ మరియు రహమాత్ హుస్సేన్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, బీసీ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మరియు మాజీ మార్కెట్ కమిటీ చేర్మెన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముక్త కంఠం తో పొన్నం ప్రభాకర్ గారిపై రాణి రుద్రమదేవి చేసిన నిరధారణ ఆరోపణలు వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. లేని పక్ష్యంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తర్వాత టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ రాణి రుద్రమదేవి నిజానిజాలను పూర్తిగా తెలుసుకొని ఆరోపణలు చేయాలని, మచ్చలేని మహా నాయకుడు పొన్నం ప్రభాకర్ని, కొత్త కారులో చెక్కర్లు కొడుతున్నారు అంటూ పొన్నం ప్రభాకర్ గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక రాష్ట్రానికి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన రాణి రుద్రమదేవి అజ్ఞానాన్ని చూస్తే హస్యస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తాను చెప్పిన టొయోట వెల్ఫేర్ అనే కారు నెంబర్ ప్లేట్ చెప్పమని అదే విధంగా ఎక్కడ పార్క్ చేసి ఉందొ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మంత్రి పై చేసిన ఇతర ఆరోపణలు అన్నింటికి తగిన ఆధారాలను చూపించాలని కోరారు.
ఇలాంటి వ్యాఖ్యల్ని వెనక నుండి చెప్పిస్తున్న బండి సంజయ్ గారికి రోహిత్ రావు సూటిగా ఒక ప్రశ్న విసిరారు. కరీంనగర్ కి ఒక ఎంపీగా మీరు ఏమి అభివృద్ధి చేశారు చూపించండి అని ఇదే విషయమై కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా లో గాని, ఇందిరా చౌక్ లో గాని, డ్యామ్ కట్టపై గాని, తీగల వంతెన పై గాని లేదా మీకు ఎంతగానో ఇష్టమేన మహాశక్తి ఆలయానికి వచ్చి పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధిని చూపించడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు.
ఇదే బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో ఎంతోమందికి పలు నియోజకవర్గాలకు చెందిన వారికి టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి వందల కోట్లు దండుకొని నమ్మకద్రోహం చేసిన మాట వాస్తవం కదా..? ఇలా సేకరించిన పాదయాత్ర నిధులతో పాదయాత్ర నిర్వహించడమే కాకుండ దొంగ లెక్కలు చూపించి బిజెపి అధిష్టానం నుండి డబ్బలు సేకరించింది నిజం కదా అని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అదే విధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ నివాసి ఐన సిరిసిల్ల నియోజకవర్గపు బిజెపి అభ్యర్థి రాణి రుద్రమదేవి కి సిరిసిల్ల కి ఉన్న సంబంధం ఏంటని, అత్యధిక సామజిక వర్గమైన పద్మశాలి కులస్తుడైన లగిశెట్టి శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వకపోవడం వెనక ఏం ఆంతర్యం ఉన్నదో అని ప్రశ్నించారు. కేవలం కేటీఆర్ని సునయసంగా గెలిపించాలానే ఉద్దేశంతోనే ఒక డమ్మీ అభ్యర్థి గా రాణి రుద్రమదేవి బరి లో దింపిన మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కి రాణి రుద్రమదేవి పై ఎందుకంత ప్రేమో వారికే తెలియాలని వాక్యానించారు.
తనపై రుద్రమదేవి చేసిన ఆరోపణకు దీటుగా తనకింతగానో ఇష్టమైన శ్రీ మల్లికార్జున స్వామి చిత్రపటంపై ప్రమాణం చేసి మీడియా మిత్రుల సమక్షంలో పొన్నం ప్రభాకర్ పై మరియు తనపై రాణి రుద్రమదేవి చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఇదే సందర్బంగా బండి సంజయ్ నిజంగానే మగాడైతే, నిక్కసేన హిందువే అయితే రామ భక్తునివే ఐతే బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఏలాంటి అవినీతికి పాల్పడలేదని దైవ సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని డిమాండ్ చేసారు.
ఈ మీడియా సమావేశంలో రోహిత్ రావు తో పాటు సుడా చైర్మన్ మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చర్ల పద్మ, మానకొండూరు మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, పిసిసి నాయకులు రహమాత్ హుస్సేన్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొబ్బిలి విక్టర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పూరం రాజేశం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానోతు శ్రవణ్ నాయక్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అనిల్, కొత్తపల్లి మండల అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్, కొత్తపెళ్లి పట్టణ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షులు కామిరెడ్డి రామిరెడ్డి, కొత్తపెళ్లి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, జేరిపోతుల వాసు, భూక్యా ప్రేమ్ నాయక్, మహమ్మద్ అమీర్, బుర్ర హరీష్ గౌడ్, కాశిపాక రాకేష్, వడ్డేపల్లి విష్ణువర్ధన్, తదితరులు పాల్గొన్నారు.