డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పదవ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతరం ఉపాధ్యాయులను విద్యార్థులను అధికారులను ప్రోత్సహించి,పర్యవేక్షించి రాష్ట్రస్థాయిలో పదవ తరగతి ఫలితాల్లో మూడవ స్థానం పొందడానికి విశేష కృషి చేసిన జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ ని ఈరోజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించి సన్మానించారు. గత సంవత్సరం ఆరో ర్యాంకు నుండి ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానం పొందిందని అన్నారు. రాష్ట్రస్థాయి లో మూడో ర్యాంకు సాధించడంలో డిఈఓ కృషి కీలకమైనదని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏసీజీ వెంకటేశ్వరరావు ను అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పీజీహెచ్ఎం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్. మోతిలాల్ ,, టి ఏస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ , బి టి ఎఫ్ అధ్యక్షులు కుమ్మరి మల్లేశం, పేట అధ్యక్షులు దేవత ప్రభాకర్ , టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు పురుషోత్తం, నీరజ వెంకటస్వామి పాల్గొన్నారు