మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపిద్ధాము
రైతును రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం
తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు
డైలీ భారత్ మెదక్, తూప్రాన్: తెలంగాణ రైతు సోదరులారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థులను గెలిపించుకొని రైతులకు సుస్థిర పాలన అందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు అన్నారు. బుధవారం ఉదయం తూప్రాన్ లోనీ శివ శివాని ఫంక్షన్ హాల్ లో మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపిద్ధాము అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తెచ్చుకొని రైతును రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 50 శాతం సాగుకు సహాయం అందిస్తున్నామని పేర్కొంటూ 10 ఏళ్లుగా కాలయాపన చేస్తూ రైతులకు బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రైతుల గురించి పట్టించుకోనీ బి.అర్.ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదని, కేంద్రంలో బిజెపి రైతులను మోసం చేసినందున అధికారం కోల్పోవడం ఖాయం అని అన్నారు. దేశ వ్యాప్తంగా రైతుల బ్రతుకుల గురించి పట్టించుకోనీ బిజెపి నీ మళ్ళీ ఎందుకు గెలిపించాలని రైతులు ఒకే మాట మీద ఉన్నారని, అలాంటప్పుడు బిజెపి, బి.అర్.ఎస్ లను ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్తులను గెలిపించాలని కోరారు. రైతుల ఆదాయం 2022 నుంచి రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒక్క చర్య కూడా చేపట్టలేదని బిజెపి పాలన ను దుయ్యబట్టారు. రైతులు పండించిన పంట కు సరైన ఎం.ఎస్.పి ధర నిర్ణయించలేదు, చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. పంట నష్టం జరిగి రైతు నష్టపోతే నష్టపరిహారం కానీ పంట భీమా కల్పించిన పాపన పోలేదని అన్నారు. మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ను వ్యవసాయ పనులకు అనుసంధానం చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో బి.అర్.ఎస్ పార్టీ అధికార దాహం తో రైతు వ్యతిరేక విధానాలతో నిలువు దోపిడీకి గురయ్యారని పేర్కొంటూ మరోవైపు ప్రాజెక్టులు, కాల్వలని, అభివృద్ధి పనులనీ అవసరాలకు మించి పేదల భూముల్ని గుంజుకొని మార్కెట్ రేటు లో సగం కంటే తక్కువ ఇచ్చి పోలీసులచే కేసులు పెట్టించీ, లాఠీ దెబ్బలు కొట్టించి భయ బ్రాంతులకు గురి చేసి రైతులను రోడ్డు మీదికి ఇడ్చిన బి.అర్.ఎస్ కు గుణపాఠంచెప్పి ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట నష్టానికి 10 వేలు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారనీ, ఆగస్టు పదిహేను న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం టి.పి.సి.సి అధికార ప్రతినిధి స్పోక్స్ మెన్ పల్లే రాంచందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలన్ సాగించిన బి.అర్.ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒక్కటే అని మన భవిష్యత్ గురించి, పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ను భారీ మెజార్టీ తో గిలిపించాలని కోరారు. అనంతరం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజు మాట్లాడుతూ తాను రైతు కుటుంభం నుంచి వచ్చి రైతు బిడ్డ గా అనేక కష్ట నష్టా లో పాలై ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. రైతుల కష్టాలు తొలగాలంటే బిసి ముద్దు బిడ్డ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు, టి.పి.సి.సి అధికార ప్రతినిధి పల్లే రాంచందర్ గౌడ్, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజు, కౌన్సిలర్ లయన్ పల్లేర్ల రవీందర్ గుప్త, కుమ్మరి రఘుపతి, బోల్లు నాగులు ముదిరాజు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.