డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తుక్కుగూడ.. ఇది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్.! అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ్నుంచే శంఖారావం మోగించి అఖండ విజయం దక్కించుకుంది. దీంతో ఇప్పుడు ఇదే తుక్కుగూడ నుంచే పార్లమెంట్ ఎన్నికలకు కూడా శంఖారావం మోగించింది కాంగ్రెస్. ఈ భారీ బహిరంగసభకు ‘జనజాతర’ అని నామకరణం చేయడం జరిగింది. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీ జెండాలతో నిండిపోయింది..! ఈ జనజాతర సభలో చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతంలో నిర్వహించన జనజాతర భారీ బహిరంగ సభకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి.
రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే చుట్టూ ఉన్నందున మరియు దేశం చూస్తున్నందున కాంగ్రెస్ పార్టీ తన ఆరు హామీలను సమావేశం నుండి ప్రకటించాలని యోచిస్తోంది, ఇది పెద్ద వ్యవహారంగా ఉండాలి అన్నారు . మన దేశ భవిష్యత్తుకు… ఈ ప్రాంత అభివృద్ధికి కీలకమైన లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డమీద నుంచి కాంగ్రెస్ పార్టీ “జంగ్ సైరన్” మోగించింది అని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇచ్చే భరోసా (మేనిఫెస్టో)ను ఈ వేదిక నుంచే కాంగ్రెస్ అధినాయకత్వం విడుదల చేయడం హర్షణీయమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుందని.. చేవెళ్ళ బంపర్ మెజార్టీతో గెలుస్తామని రంజిత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.