| Daily భారత్
Logo




అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా

News

Posted on 2024-04-06 19:40:57

Share: Share


అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా

జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు,14 కేసులు నమోదు,16,13,000/- నగదు రూపాయలు , 359 డాక్యుమెంట్లు స్వాధీనం.

సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.

ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఫైనాన్స్ నిర్వహించాలి

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఐపీఎస్.,

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం రోజున జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్ ల గా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ వడ్డీ వ్యాపారాం,ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మంది పై కేసులు నమోదు చేసి 16,13,000/- నగదు రూపాయలు , 359 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,అనుమతులు లేకుండా ఫైనాన్స్  నిర్వహించిన, అధిక వడ్డీలతో  సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 

ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి,తాత్కాలిక అవసరాల కోసం అధిక మొతంలో అవసరంకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు ,అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకుపాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దు అని ఎస్పీ కోరారు.

ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు  జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు  సమాచారం ఇవ్వొచ్చు అని, అలాగే స్థానిక పోలీసు వారికి ,డయల్100 కు పిర్యాదు చేయాలని ఎస్పీ కోరినారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు. 

అప్పు తీసుకోవడం,ఇవ్వడం నేరం కాదు కానీ RBI నియమ నిబందనలు,తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు.కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Image 1

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Posted On 2026-03-07 21:33:43

Readmore >
Image 1

పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న చండ్రుగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కొడగండ్ల వెంకటరెడ్డి

Posted On 2026-03-07 21:31:59

Readmore >
Image 1

చత్రపతి శివాజీ మహారాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

Posted On 2026-03-07 21:29:26

Readmore >
Image 1

బుద్ధ ప్రకాష్ జ్యోతి కి వినతి పత్రం ఇచ్చిన వి కే సి ఎం యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు

Posted On 2026-03-07 21:28:26

Readmore >
Image 1

మహిళల సాధికారతే సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-03-07 21:24:13

Readmore >
Image 1

సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు

Posted On 2026-03-07 21:22:31

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

Posted On 2026-03-07 20:16:11

Readmore >
Image 1

చంద్రంపేట పాఠశాలలో ముందస్తుగా మహిళా దినోత్సవ వేడుకలు

Posted On 2026-03-07 18:21:58

Readmore >
Image 1

కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

Posted On 2026-03-07 18:14:07

Readmore >
Image 1

హామీలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

Posted On 2026-03-07 18:12:44

Readmore >