| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆకస్మిక పర్యటన: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

ఆకస్మిక  పర్యటన: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్, అంగన్వాడి కేంద్రాలు, సఖీ కేంద్రం, బాల సదనం ఆకస్మిక  పర్యటన చేసిన 

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వై త్ కుమార్ సింగ్

డైలీ భారత్, మహబూబాబాద్: శనివారం నాడు, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ జిల్లా కురవి మండల పరిధిలోనీ బలపాల, గజతండా, మహబూబాబాద్ పట్టణంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్, అంగన్వాడి కేంద్రాలు, సఖీ కేంద్రం, బాల సదనం ల ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బలపాలలో జిల్లా పరిషత్ హైస్కూల్, అంగన్వాడి సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి హైస్కూల్లో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు త్రాగునీరు, మరుగుదొడ్లు, క్లాస్ రూమ్ ల సుందరీకరణ (చదువు) గురించి ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ని ఐదు హెల్త్ సబ్ సెంటర్లు ద్వారా ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవల గురించి ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు, వివరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతినీ, అడిగి తెలుసుకున్నారు, వేసవికాలం దృశ్య ప్రతి సబ్ సెంటర్లు ద్వారా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల వద్ద (ఓఆర్ఎస్) ప్యాకెట్లు కావలసిన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

త్రాగునీరు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రూపొందించిన త్రాగునీరు యాక్షన్ ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అంగన్వాడి కేంద్రాలలో గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు అందిస్తున్న బలవర్ధకమైన ఆహారం గుడ్లు, పాలు, నూనె, బాలామృతం, పప్పులు సమయానికి అందించాలన్నారు.

మహబూబాబాద్ పట్టణంలోని బాలసదనం, సఖి కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులను, పరిసరాలను పరిశీలించారు.

నిరాధారణకు గురైన తల్లిదండ్రులు లేని పిల్లలకు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేందుకు వారి సంరక్షణ చూసుకునే విధంగా కేంద్రాలు పనిచేయాలని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలని  వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు.

ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కురవి తహసిల్దార్ యూ.సునీల్ రెడ్డి, ఎంపీడీవో వీరబాబు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతి, వసతి గృహాల నిర్వాహకులు డి.లక్ష్మి, సుగుణ మనీషా కళ్యాణి తదితరులు ఉన్నారు.

Previous లూపస్ వ్యాధి ప్రజల్లో అవగాహన ఉందా...?
Next అక్రమ వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా
ADVERTISEMENT