డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూధన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుదవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. మొయినాబాద్ పరిధిలోని ఫాం హౌస్ లో ఎలుగంటి మధుసూధన్ రెడ్డికి పామెన మాజీ సర్పంచ్ దావలి గారి గోపాల్ రెడ్డి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు దావలి గారి శ్రీనివాస్ రెడ్డి ,ఎర్ర గోపాల్, కలిసి శాలువతో సత్కరించారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు మధుసూదన్ రెడ్డి అని అన్నారు . రాజకీయ నాయకుడంటే ప్రజా సేవకుడే తప్ప ప్రజలపై పెత్తనం చెలాయించే మధుసూధన్ రెడ్డి కాదని అన్నారు. రాబోయే రోజుల్లో మధుసూదన్ రెడ్డి పెద్ద ప్రజా ప్రతినిధిగా ఎదగలని వారు కోరారు.