| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేతన్నల బతుకులతో ఆడుకోవద్దు

నేతన్నల బతుకులతో ఆడుకోవద్దు

CITU - పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో బిక్షాటన చేసి నిరసన తెలిపిన నేతన్నలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం  ఉపాధి సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ , సిరిసిల్లలో నేతన్నల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగా ఈరోజు సిరిసిల్లలో సిఐటియు ఆధ్వర్యంలో నేతన్నలు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన సిరిసిల్లలో ప్రస్తుతం సంక్షోభం వలన పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది పవర్లుమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు నేతన్న లకు చేయూత అందించి బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకుండా నీ కన్నుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి వెంటనే సిరిసిల్లలో నేతన్నలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని లేకుంటే ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు రేపు చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వంటా వార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , ఓగ్గు గణేష్ , సదానందం , భాస్కర్ , క్రిష్ణ , ఇస్తారి , రాజు , సురేష్ , తిరుపతి , శంకర్ ,  శ్రీనివాస్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Previous ఇందిరమ్మ రాజ్యం అంటే 400 వందలు ఉన్న ఫీజు 2000లకు పెంచడమేనా సీఎం రేవంత్ రేడ్డి
Next ఎలుగంటి మధుసూధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
ADVERTISEMENT