డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా :సిరిసిల్ల పట్టణం బి వై నగర్ చర్చ్ దగ్గర దొంగల బీభత్సం
రాత్రి 11.30. గంటల ప్రాంతంలో పరకాల లక్ష్మి( 55)ఒంటరి గా ఉన్న మహిళా ఇంట్లోకి చొరబడి కాళ్ళు చేతులు కట్టేసి మేడపై కత్తి పెట్టి నగదు దోసుకెళ్లిన దొంగలు..
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దొంగల బీభత్సం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వరుస దొంగతనాలతో మారు మోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే
స్థానికుల వివరాల ప్రకారం
సిరిసిల్లలోని బీ వై నగర్ కు చెందిన పరకాల లక్ష్మీ గౌడ్ అనే వృద్ధురాలు పై అర్ధరాత్రి అగాంతకుడు దాడి చేసి కత్తి మెడ పై పెట్టి వృద్ధురాలు దగ్గర డబ్బులు దొంగలించినట్లు పేర్కొన్నారు
పరకాల లక్ష్మి పై దాడి చేసిన దుండగులు కత్తితో మెడపై కోయడంతో రక్తం రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నట్లు స్థానికులు తెలిపారు.
వరుస దొంగతనాలతో జిల్లాలోని ప్రజలు భయభ్రాంతులతో రాత్రి బిక్కుబిక్కుమని గడుపుతున్నామని ప్రజలు వాపోతున్నారు.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు..