| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజా వనరులు నాశనం చేస్తారా..?

వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజా వనరులు నాశనం చేస్తారా..?

"నేషనల్ మార్ట్" కోసం కల్వర్టు చిద్రం..!

 ఇది ప్రజా శ్రేయస్కరం కాదని మాజీ ఎమ్మెల్యే "బక్కని నర్సింహులు" ఆగ్రహం

షాద్ నగర్ ఆర్.అండ్.బి, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల తీరుపై విమర్శలు

అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే "బక్కని" డిమాండ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రజా ప్రయోజనాలకు అవసరమైన వనరులను వ్యాపార కార్యకలాపాల కోసం ధ్వంసం చేస్తే రాబోయే తరాలకు ఎలా సౌకర్యంగా ఉంటుందని ప్రజలు ఏమైపోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ప్రశ్నించారు. షాద్ నగర్ పట్టణ శివారులోని ఓల్డ్ హైవేలో నూతనంగా నిర్మించిన నేషనల్ మార్ట్ కోసం ప్రభుత్వ కల్వర్టును ధ్వంసం చేసి వారికి అనుకూలంగా మార్చుకొని ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యవహారంపై ఆయన గురువారం పరిశీలించారు. నేషనల్ మార్ట్ ఎదురుగా ఎన్నో ఏళ్ల పురాతన నీటి కల్వర్టును మార్చి అడ్డంగా గోడ నిర్మించడం పట్ల బక్కని నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతని నిలదీశారు. నేషనల్ మార్ట్ మేనేజర్ ను పిలిచి చివాట్లు పెట్టారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వానికి సంబంధించిన కల్వర్టు నీరు ఎగువ ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి సులువుగా వెళ్లేందుకు ఈ కల్వర్టు ఏర్పాటు చేశారని ఇలాంటి నాళలాలను ధ్వంసం చేస్తే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే ఆ నీరు ఎక్కడికి పోతుందని? నేషనల్ మార్ట్ సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజలకు ఎల్లకాలం అవసరమైన ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే అధికారం ఎవరిచ్చారని? మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ముఖ్యంగా ఆర్ అండ్ బి అదేవిధంగా ఇరిగేషన్ శాఖలు ఈతంగంపై ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదేవిధంగా నేషనల్ మార్ట్ నిర్మాణానికి మున్సిపల్ శాఖ ఎలా అనుమతి ఇచ్చిందని బక్కని నరసింహులు ప్రశ్నించారు. వెంటనే అధికారులు ఇలాంటి ప్రజా ఉపయోగకరమైన వనరులను దోషం చేస్తే సహించకూడదని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ మార్ట్ ఎదురుగా కల్వర్టుపై కొత్తగా నిర్మించిన కట్టడాలు రోడ్డుపై ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉందని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆక్షేపించారు. అసలు ప్రజా వనరులను ఎలా విధ్వంసం చేస్తారని ప్రశ్నించారు. నీటి కాలువలు లేకపోతే నీరు చెరువుకుంటలలోకి ఎలా చేరుతుందని ప్రశ్నించారు. సోలిపూర్ చెరువుకు వెళ్లాల్సిన ఎగువ ప్రాంతానికి చెందిన నీరు ఇక్కడే ఆపే విధంగా నేషనల్ మార్ట్ అడ్డగోడలు కట్టడం సరికాదని వాటిని వెంటనే తొలగించి నీరు వెళ్లేందుకు దారి సులువు చేయాలని బక్కని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కోరారు. ఆర్ అండ్ బి, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. హాజిపల్లి శివారు ఎగువ ప్రాంతమైన బేచిరాగ్ (నివాసం లేని ప్రదేశం) ఫరూక్ నగర్ తదితర ప్రాంతాల ఎగువ నీరు ఈ నాలా ద్వారానే కల్వర్టులో ప్రవహిస్తుందని చెప్పారు. ఇప్పుడు వాటిని ధ్వంసం చేసి అడ్డగోడలు పెట్టి నీరు పారకుండా వాటిని రెండువైపులా మళ్లించే ప్రయత్నం చేయడంతో భవిష్యత్తులో ఇతర కాలనీలకు ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పారు. వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు..

Previous సిరిసిల్ల లో వరుస దొంగ తనాలతో హల్చల్ చేస్తున్న దొంగలు
Next దేశంలో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ADVERTISEMENT