జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి కళావతి భాయ్
డైలీ భారత్, మహబూబాబాద్: ఆరోగ్య కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది అలసత్వం వహించరాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి కళావతి భాయ్ అన్నారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి కళావతి భాయ్ సోమవారం ఐ.డి.ఓ.సి. లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ డిఎంహెచ్వోలు , ప్రోగ్రాం ఆఫీసర్స్ తో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించడం జరిగింది. ఈ సందర్బంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల నమోదు 12 వారాల్లో జరగాలని, సాధారణ ప్రసవాలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరగాలని, సిజేరియన్ ఆపరేషన్లను తగ్గించాలని, వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలని, అసంక్రమిత వ్యాధులైన బిపి షుగర్, క్యాన్సర్ వ్యాధులు నిర్ధారణ 30 సంవత్సరములు పైబడిన వారందరినీ పరీక్షించాలని, కుష్టు నిర్మూలన కార్యక్రమంలో చేపడుతున్న కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే కార్యక్రమం విజయవంతం చేయాలని , రెండు వారాలకు పైన దగ్గుతో బాధపడుతున్న వ్యక్తులకు తెమడ పరీక్షలు చేయాలని , టెలి మెడిసిన్ సేవలను వినియోగించుకోవాలని, రానున్న వేసవి కాలంలో ఓ ఆర్ ఎస్ కార్నర్లను ఏర్పాటు చేయాలని అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేసి, మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ముందు వరుసలో ఉంచాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం ఎం హెచ్ వో లు, డాక్టర్ అంబరీష, డాక్టర్ మురళీధర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బిందు శ్రీ, డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ శ్రవణ్ కుమార్, డిప్యూటీ డెమో ప్రసాద్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.