| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏయుడ్స్ అంటూ వ్యాధి కాదు అంటించు కునే వ్యాధి

ఏయుడ్స్ అంటూ వ్యాధి కాదు అంటించు కునే వ్యాధి

ఏయుడ్స్ పైన ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలి

డైలీ భారత్, మహబూబాబాద్: సోమవారం నెహ్రూ యువ కేంద్ర  ప్రోగ్రామ్ ఆఫీసర్ అన్వేష్  ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల  ప్రిన్సిపాల్ దాసు రాజు  అధ్యక్షతన HIV /STI పైన విద్యార్థులకు అవగాహన సదస్సు డిగ్రీ కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ DM&HO కళావతి భాయి  పాల్గొన్నారు ఈ సందర్భంగా  DM&HO మాట్లాడుతూ క్షణిక సుఖాల కోసం యువకులు వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టకూడదని  ప్రతి ఒక్కరు HIV /AIDS పైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అలాగే అడిషనల్ DM&HO బిందు శ్రీ  మాట్లాడుతూ హెచ్ఐవి బారిన పడినట్లయితే నేరుగా ఐసిటిసి కేంద్రాలలో పరీక్షలు చేయించుకొని మందులు వాడాలని అన్నారు. యువకులు చదువుకునే రోజులలో తప్పుదోవ పట్టరాదని అన్నారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అడిషనల్ డైరెక్టర్ మాధవ్  మాట్లాడుతూ యువకులా సోషల్ మీడియా twitter, facebook, instagram, youtube, National HIV/ÀIDS help line1097  గురించి వివరించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్ర మేనేజర్ రమేష్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలని హెచ్ఐవి ఉన్నట్లయితే మందులు వాడాలని లేనట్లయితే సంపూర్ణ సురక్ష కేంద్రం యొక్క సేవలు వినియోగించు కోవాలని అన్నారు. హెచ్ఐవి తోపాటు shypilis, STI, TB,HBV, HCV ఇలాంటివి లైంగిక సుఖ వ్యాధులు ఎలా వస్తాయో వివరించారు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎన్ఓ మంగమ్మ, కరుణ మైత్రి పాజిటివ్ నెట్వర్క్ రవీందర్ లోడీ సాంఘిక సేవ సంస్థ కోఆర్డినేటర్ వీరబాబు అనిత శిరీష డిగ్రీ కళాశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వారికి మూడు రకాల క్విజ్ కాంపిటీషన్ డ్రాయింగ్ మరియు ఎస్సై రైటింగ్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు త్వరలో ఇస్తామని నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ అన్వేష్  తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర వాలంటర్ సుజిత్  విధాలుగా సమన్వయపర్చటం జరిగింది.

Previous ఆరోగ్య కార్యక్రమాల అమలులో అధికారులు అలసత్వం వహించరాదు
Next పదవ తరగతి పరీక్షల సరళని పరిశీలించిన జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ అధ్వైత్ కుమార్ సింగ్
ADVERTISEMENT