డైలీ భారత్,మహబూబాబాద్: ఈ రోజు నుండి ప్రారంభమైన పదవ తరగతి వార్షిక పరీక్షల సరళిని మహబూబాబాద్ పట్టణం భవానినగర్, ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్లో పరిశీలించిన జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు నుండి జిల్లాలో (49) సెంటర్లలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా (8191) విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని,
పరీక్షా కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు త్రాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలు కల్పించి, పరీక్షా కేంద్రాల వద్ద (144) సెక్షన్ విధించడం జరిగిందని అన్నారు.
పరీక్షల ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సరియైన భద్రత మధ్య ఎస్కార్టుతో తరలించాలని చీఫ్ సూపర్డెంట్, పోలీస్ సిబ్బంది, సంబంధిత సెంటర్ నిర్వాహకులను ఆయన ఆదేశించారు.
ఈ పరీక్షా కేంద్రాల తనిఖీలలో ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ప్రిన్సిపల్ ఏ.వెంకటేశ్వరరావు, కిరణ్ తదితరులు ఉన్నారు.