| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి

ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి

ఏసీబీకి చిక్కిన నిజాంపేట టౌన్ ప్లానింగ్ అధికారి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

డైలీ భారత్, నిజాంపేట్: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు (ఏసీబీ) ఓ టౌన్ ప్లానింగ్ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా అదపులోకి తీసుకున్న ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని నిజాంపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట పట్టణంలో ఓ టీ పాయింట్ బోర్డును తొలగించకుండా ఉండేందుకు టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస‌రావు షాపు యజమాని నుంచి రూ.1.50 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు శ్రీనివాస‌రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా అతడి సహకరించిన మరో వ్యక్తిని కూడా వారు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇద్దరినీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Previous పదవ తరగతి పరీక్షల సరళని పరిశీలించిన జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ అధ్వైత్ కుమార్ సింగ్
Next గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ADVERTISEMENT