| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

డైలీ భారత్, హైదరాబాద్:గాడిద వెంట వెళితేనే గుర్రం విలువ తెలుస్తుంది…అని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని అన్నారు.

కేవలం మూణ్నెల్లలోనే వారికి వాస్తవాలు బోధపడు తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ఒక్కసారి ఓడి పోయినంత మాత్రాన నష్టమేమీ లేదని ఆయన అన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ఎర్రవెలిల్లోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. అనంతరం మాట్లాడు తూ… దళితులతోపాటు బహుజనులు కలిసి పోరాటం చేయాలన్నారు. అప్పుడే హక్కులు, రాజ్యా ధికారం సాధ్యమవుతాయ ని చెప్పారు.

ఈ క్రమంలో అగ్రవర్ణాల్లోని పేదలను కలుపుకుని పోవా లని చెప్పారు.కాన్షీరాం ఇదే సిద్ధాంతంపై పోరాటం చేశా రని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సిన అవసరముందని సూచించారు.

Previous ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారి
Next జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ కు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు
ADVERTISEMENT