లౌకికశక్తుల పునరేకీకరణకు సర్వం ఒడ్డుతాం
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయని ప్రకటించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
పార్టీ పటిష్టతకు ఎదురైన ఆటంకాలను తొక్కేస్తామని హెచ్చరిక
నిజాయితీపరుడు, సమర్ధుడు, మేధావి చల్లా వంశీచంద్ర రెడ్డి
వంశీచంద్ రెడ్డి గెలుపుకు భారీ మెజార్టీ అందిస్తాం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ప్రజాస్వామ్యం పరిణతి చెందాలి. ప్రజలందరికీ మేలు జరగాలి. అందుకోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతాం. కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాడుతాం. పార్టీ ప్రతిష్టత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటాం త్వరలోనే భారీ చేరికలు ఉంటాయని వాటికి ఆటంకాలు సృష్టిస్తే తొక్కిపాడేస్తామని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిడబ్ల్యుసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, ఐఎన్టియుసి నాయకులు రఘు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం కుటుంబాలకు కూడా సమయం ఇవ్వకుండా కేవలం ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడే వ్యక్తుల్లో వంశీధర్ రెడ్డి, తాను ఉన్నామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పునరేకికరణ కోసం పార్టీ జవసత్వాలు నింపేందుకు భారీ ప్రణాళికలు చేపట్టబోతున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరుల సహకారంతో పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేస్తామని స్పష్టం చేశారు. ఒకటి రెండు మండలాల్లో పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని అన్నారు. అక్కడక్కడ కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయని వాటిని కూడా తొక్కిపెట్టి బలమైన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ అవతరించేందుకు కృషి చేస్తానని అన్నారు. సమస్యలను అధిగమించి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో గ్రామస్థాయి నుండి నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వంశి చంద్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఎవరు ఊహించని మెజారిటీ అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంటు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా రాబోయే తరానికి మంచి రాజకీయ వేదిక కాంగ్రెస్ పార్టీ అవుతుందని అందరికీ అన్ని అవకాశాలు వస్తాయని సమయానూకూలంగా స్పందిస్తామని అన్నారు. వంశీ చంద్ రెడ్డి మంచి పనిమంతుడని సమర్ధుడు మేధావి నిజాయితీపరుడని ఇలాంటి వ్యక్తులను సమాజంలో గెలిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని వీర్లపల్లి శంకర్ ఈ సందర్భంగా కొనియాడారు. గతంలో పనిచేసిన పార్లమెంటు సభ్యులు ఒక్కరు కూడా పాలమూరు గళాన్ని పార్లమెంటులో వినిపించలేదని కానీ వంశీ చంద్ రెడ్డి మంచి యువకుడనీ తన గళాన్ని పాలమూరు ప్రజల కోసం వినిపించడం ఖాయమని అన్నారు. గతంలో నోట్లో నాలుక లేని వ్యక్తులను పార్లమెంటుకు గెలిపించి పొరపాటు చేశారని అలాంటివి జరగవని ఇకపై తెలంగాణ రాష్ట్రానికి కాదు పాలమూరుకు కూడా మంచి భవిష్యత్తు ఉండబోతుందని శంకర్ స్పష్టం చేశారు. ఈ విలేకరులకు సమావేశంలో షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, రఘునాయక్, బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, కొత్తూరు మండల అధ్యక్షుడు, హరినాథ్ రెడ్డి, ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నందిగామ మండల అధ్యక్షుడు జంగ నరసింహ, చౌదరిగుడా మండల అధ్యక్షుడు రాజు, కేశంపేట్ మండల అధ్యక్షుడు వీరేశం, తిరుపతి రెడ్డి, బస్సులమప్ప, మరియు ఎంపీటీసీలు సర్పంచులు సింగిల్విండో డైరెక్టర్లు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు..