| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాలమూరు ప్రజా గొంతును పార్లమెంటులో వినిపిస్తా:చల్లా వంశీచందర్ రెడ్డి

పాలమూరు ప్రజా గొంతును పార్లమెంటులో వినిపిస్తా:చల్లా వంశీచందర్ రెడ్డి

మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి

షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల సహకారం కోరుతున్నాం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి

పార్టీలోని అన్ని విభాగాల శ్రేణులు  సహకరించాలి

వంశీచంద్ర రెడ్డిని సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :పాలమూరు ప్రజల గొంతును పార్లమెంటులో వినిపిస్తానని ప్రజలకు నిరంతరం అండగా ఉంటానని మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిడబ్ల్యుసీ సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నేత మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు పి. రఘ, జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, పట్టణ నాయకులు చెంది తిరుపతి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వంశి చంద్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతో ఆయన పూర్తి సహకారంతో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆశీస్సులతో పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన అభ్యర్థిత్వాన్ని ఎఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల్లో కార్యకర్తల పూర్తి సహకారంతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను భారీ మెజార్టీతో కార్యకర్తలు వివిధ విభాగాల శ్రేణులు గత ఎన్నికల్లో సంపూర్ణ సహకారం ఎలా అందించారో తనకు కూడా అలాగే సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే శంకర్ సహకారం కోసం తను ఇక్కడికి వచ్చానని చెప్పారు. నియోజకవర్గం ప్రజల కార్యకర్తల సహకారం ఉంటే కాంగ్రెస్ గెలుపు తధ్యమని వంశీచందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఎమ్మెల్యే శంకర్ అని గుర్తు చేశారు. ఆయన సంపూర్ణ సహకారం కూడా తనకు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజా గొంతును పార్లమెంటులో వినిపిస్తానని పాలమూరు అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. తన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వంశీచందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్, రఘునాయక్, బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, కొత్తూరు మండల అధ్యక్షుడు,హరినాథ్ రెడ్డి, ఫరూక్నగర్ మండల అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కొందుర్గు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నందిగామ మండల అధ్యక్షుడు జంగ నరసింహ, చౌదరిగుడా మండల అధ్యక్షుడు రాజు, కేశంపేట్ మండల అధ్యక్షుడు వీరేశం, తిరుపతి రెడ్డి, బస్సులమప్ప, మరియు ఎంపీటీసీలు సర్పంచులు సింగిల్విండో డైరెక్టర్లు చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. వంశీచంద్ రెడ్డిని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు ఘనంగా సన్మానించారు..

Previous రాబోయే తరానికి రాజకీయ వేదిక సిద్ధం చేస్తున్నాం : షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్
Next నమస్తే తెలంగాణ పత్రికపై కేసు
ADVERTISEMENT