డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: షాద్ నగర్ పట్టణంలోని శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో తేదీ:20-03-24 రోజున సాయంత్రం 5 గంటలకు శివ మారుతి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులను, ఇతర సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది.అదే విధంగా శ్రీ అయ్యప్ప సేవా సమితి అధ్యక్ష, కార్యదర్శులను ,ఇతర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది.కావున ఆలయ కమిటీ ప్రస్తుత సభ్యులు,అయ్యప్ప సేవా సమితి సభ్యులు,శివ మారుతి ఆలయ భక్తులు, పుర ప్రముఖులు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అని శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరం ఆలయ సభ్యులు కోరారు.
News
ఈ నెల 20న శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ ఎన్నిక